- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నెట్ జీరో స్టాల్.. క్విజ్ పోటీల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం, డీజీపీ
తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో భాగంగా ఎక్స్ లో విద్యుత్ శాఖ హరిత ఇంధనం ఉత్పత్తి పై ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్ కు విశేష ఆదరణ లభిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో భాగంగా ఎక్స్ లో విద్యుత్ శాఖ హరిత ఇంధనం ఉత్పత్తి పై ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ స్టాల్ లో విద్యుత్ వాహనాలు, వేస్ట్ టు ఎనర్జీ, విండ్ పవర్, పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల నమూనాలను ఏర్పాటు చేశారు. మంగళవారం, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, డీజీపీ శివధర్ రెడ్డి, పలువురు ప్రముఖులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు స్టాల్ ను సందర్శించి అక్కడ ప్రదర్శిస్తున్న నమూనాలను పరిశీలించారు.
విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నమూనాలను ప్రదర్శించడం వల్ల ఈ స్టాల్ అత్యధిక సందర్శకులను ఆకర్షించింది. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ పనితీరుకు సంబంధించి రియల్ టైమ్ లో ప్రదర్శించడం పలువురిని కట్టిపడేసింది. పర్యావరణం, గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించడానికి నెట్ జీరో క్విజ్ సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. పలువురు సందర్శకులు ఎంతో ఉత్సాహంగా ఈ క్విజ్‌లో పాల్గొని నెట్ జీరో సర్టిఫికెట్‌ను పొందారు. డిఫ్యూటీ సీఎం, డీజీపీ కూడా ఎంతో ఉత్సాహంగా క్విజ్‌లో పాల్గొన్నారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి, రెడ్‌కో ఎండీ అనిలా, డిస్కం డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సందర్శకులకు ఈ నమూనాల గురించి వివరించారు.






