నాయి బ్రాహ్మణ, రజక వృత్తులకు డిప్యూటీ CM భటి గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

నాయి బ్రాహ్మణ, రజక వృత్తులకు డిప్యూటీ CM భటి గుడ్ న్యూస్

నాయి బ్రాహ్మణ, రజక వృత్తులకు డిప్యూటీ CM భటి గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా భవన్‌లో ఆర్టీసీ మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి చేరినందుకు ఆనందంగా ఉందని అన్నారు. మహిళా ప్రయాణికుల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ప్రత్యేక కార్డుల పంపిణీకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ప్రతి మహిళ ఈ సౌలభ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు మహిళలు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. ఇది తెలంగాణ మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యం. ప్రజా ప్రభుత్వం ఆవిర్భావం తరువాత ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను రూ.1400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించినట్లు చెప్పారు.

పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్-వరంగల్ పట్టణాలకు 100 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు వేగంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ పంపిణీ జరిగేలా సూచించారు. నాయి బ్రాహ్మణ, రజక వృత్తుల సంఘాలకు ఉచిత విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా విడుదల చేయాలని ఆదేశించారు. విద్యపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసిందని తెలిపారు. గురుకులాల మెస్, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం సమానత్వం, సాధికారత, అభ్యున్నతి దిశగా స్థిరంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story