వారికి అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ CM భట్టి ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-06 12:14:54  IST  )

వారికి అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ CM భట్టి ప్రకటన

వారికి అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ CM భట్టి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ సమ్మిట్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించినది అని అన్నారు. ప్రజా ప్రభుత్వ విజన్, డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని చెప్పారు. ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. ఎయిర్‌లైన్స్‌ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.. సమ్మిట్ హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సమస్య వస్తే.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. ‘వన్ కంట్రీ.. మెనీ సినిమాస్’ పేరుతో గ్లోబల్ సమ్మిట్‌లో చర్చిస్తామని అన్నారు. ఈ సమ్మిట్‌లో మొత్తం 27 సెషన్లు ఉంటాయని చెప్పారు. ఇలాంటి సమ్మిట్‌ గతంలో ఎప్పుడూ జరుగలేదని అన్నారు.

కాగా, ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు అందించింది. స్వయంగా రాష్ట్రానికి చెందిన మంత్రులు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వాన పత్రికలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి. తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని ఈ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు 3 వేల మంది ప్రము ఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు.

Next Story