- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో తెలంగాణ ఆరోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గతేడాది సుమారు 7 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేశామని ఈ ఏడాది మరో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) తెలిపారు. ఇవాళ మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో (EFLU) రాష్ట్ర ఆరోగ్య శాఖ (Telangana Health Department) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. నర్సులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తున్నదని చెప్పారు.
విదేశాల్లో ఉద్యోగాలు పొందేలా ట్రైనింగ్:
దేశ, విదేశాల్లో నర్సులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మన నర్సుల్లో మంచి స్కిల్ ఉంది. కానీ, జర్మన్, జపాన్ భాషలు రాకపోవడం వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందువల్ల జర్మన్, జపాన్ వంటి విదేశీ భాషలు నేర్పించి వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈరోజు ఇప్లూ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. నర్సింగ్ స్టూడెంట్స్‌కు వర్చువల్‌గా, నేరుగా రెండేళ్లపాటు విదేశీ భాషల్లో ఇంప్లూలో ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు పొందేవారికి ఈ ట్రైనింగ్ తోడ్పడుతుందని చెప్పారు. మన నర్సులు విదేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకుంటాయని చెప్పారు. నర్సింగ్ కోర్సుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగిందని హాస్పిటళ్లు, హోమ్ కేర్ నర్సింగ్‌కు పెరిగిన డిమాండుతో నర్సులకు అవకాశాలు కూడా పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని మరో 2 కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.
Read More: సీఏఆర్ కానిస్టేబుల్‌కు TSHRC చైర్‌పర్సన్ ప్రశంస.. కారణం ఏంటంటే?






