తెలంగాణలో డీఈవోల బదిలీలు.. సక్సెస్ ఫుల్‍గా అధికారుల, బోధనేతర సిబ్బంది ట్రాన్స్ ఫర్స్

by Prasad Jukanti |   (  Updated:2026-05-31 09:01:36  IST  )

తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో అధికారుల, బోధనేతర సిబ్బంది బదిలీలు విజయవంతంగా ముగిశాయి. పలు జిల్లాల డీఈవోలు బదిలీ అయ్యారు.

తెలంగాణలో డీఈవోల  బదిలీలు.. సక్సెస్ ఫుల్‍గా  అధికారుల, బోధనేతర సిబ్బంది ట్రాన్స్ ఫర్స్
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పాఠశాల విద్యాశాఖలో షెడ్యూల్ ప్రకారం అధికారుల, బోధనేతర సిబ్బంది బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.38 బదిలీల సమగ్ర మార్గదర్శకాల ప్రకారం ఈ ట్రాన్స్ ఫర్లు జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నీకోలస్ ఆదివారం స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా బోధనేతర సిబ్బంది బదిలీలను ఆన్‌లైన్ (Online Mode) విధానంలో చేపట్టినట్లు తెలిపారు. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుండి ఆఫీస్ సబోర్డినేట్ స్థాయి వరకు జిల్లా / జోనల్ / మల్టీ జోనల్ / స్టేట్ కేడర్‌కు చెందిన అన్ని బదిలీలను విజయవంతంగా నిర్వహించామని స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు అన్ని విభాగాల బోధనేతర సిబ్బంది, అధికారుల బదిలీలు విజయవంతంగా జరిగాయని తెలిపాుర. అడిషనల్ డైరెక్టర్లు (ADs), జాయింట్ డైరెక్టర్లు (JDs), జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs), డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (DyEOs), అసిస్టెంట్ డైరెక్టర్లు (Asst. Directors), సూపరింటెండెంట్లు (Supdt), సీనియర్ అసిస్టెంట్లు (Sr. Asst), జూనియర్ అసిస్టెంట్లు (Jr. Asst), ఆఫీస్ సబోర్డినేట్లు (OS) బదిలీలు జరిగినట్లు పేర్కొన్నారు.

DEOల బదిలీలు:

తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్లు, బోధనేతర సిబ్బంది బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, జిల్లా విద్యాశాఖాధికారుల (DEO) బదిలీలు కూడా జరిగినట్లు ఇవి అధికారిక వర్గాల నుంచి అందిన ప్రాథమిక వివరాల ప్రకారం డీఈవోల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి.

1.విజయకుమారి: మేడ్చల్ డీఈవో (DEO) స్థానం నుండి మహబూబ్‌నగర్ డీఈవోగా బదిలీ అయ్యారు.

2.రేణుక: వికారాబాద్ డీఈవో స్థానం నుండి బదిలీ అయి, మేడ్చల్ డీఈవోగా పోస్టింగ్ పొందారు.

3.రోహిణి: హైదరాబాద్ డీఈవో స్థానం నుండి సంగారెడ్డి డీఈవోగా బదిలీ అయ్యారు.

4.సుశీందర్ రావు: రంగారెడ్డి డీఈఓ స్థానం నుండి నల్గొండ డీఈవోగా బదిలీ అయ్యారు.

5.బి. భిక్షపతి: నల్గొండ డీఈవో స్థానం నుండి యాదాద్రి భువనగిరి డీఈవోగా బదిలీ అయ్యారు.

6.రేవతి రెడ్డి: రంగారెడ్డి జిల్లా నూతన డీఈగా నియమితులయ్యారు.

7.వెంకటేశ్వర్లు: సంగారెడ్డి స్థానం నుండి బదిలీ అయి, హైదరాబాద్ జిల్లా నూతన డీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

8. శాస్త్రి (అసిస్టెంట్ డైరెక్టర్): సిద్దిపేట జిల్లా డీఈవోగా పోస్టింగ్ పొందారు.

Next Story