Delhi Liquor Scam కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

by GSrikanth |   (  Updated:2023-01-03 06:56:14  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Delhi Liquor Scam కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లైలకు రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాంలో సీబీఐ ఛార్జ్ షీట్ పై ఇవాళ స్పెషల్ కోర్టు విచారణ జరిగింది. ఈ ఛార్జ్ షీట్ లో ఇందులో అభిషేక్ బోయిన పల్లి, ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్రపిళ్లై లపై అభియోగాలు మోపింది. సీబీఐ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి ఇప్పటికే బెయిల్ వచ్చింది. ఇవాళ కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లై లకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 25 ఛార్జ్ షీట్ నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నామని సీబీఐ కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఛార్జ్ షీట్ పై విచారణ జరుపుతుండగా మిగతా వారు తమ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నాగ్ పాల్ విచారణ జరిపి బెయిల్ మంజూరు చేశారు.. +

Also Read..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు..!

Next Story