TG: హైదరాబాద్‌లోనే ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్

by Gantepaka Srikanth |

ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన లభించాలంటే చదువు ఒక్కటే మార్గామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

TG: హైదరాబాద్‌లోనే ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన లభించాలంటే చదువు ఒక్కటే మార్గామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాను అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. గురువారం 59 దళిత కులాల సంఘాల నాయకులు లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ భవన్‌ను మరియు కాచిగూడ లోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు..

కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్దంచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సివిల్స్ కోచింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందని మంత్రి తెలిపారు. దళిత విద్యార్థులు ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కోచింగ్ తీసుకోవడం ఖర్చుతో కూడిన పని కావడంతో ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్ధుల కోసం కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గెస్ట్ లెక్చర్స్ తీసుకోవడంతో పాటు మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు. కోచింగ్ తీసుకునే అభ్యర్థుల కోసం హాస్టల్, మెస్, స్టడీ హాల్స్ వంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్‌లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలిపారు. సివిల్స్, గ్రూఫ్–1 గ్రూఫ్–2 కోచింగ్ కోసం మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఒక హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తామని మంత్రి తెలిపారు.

ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు..

ఎస్సీ యువతలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల ప్రతినిధిత్వం పెరిగే విధంగా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు. తమిళనాడు మోడల్‌లా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్‌గా (పరిపాలకుడిగా) తీర్చిద్దిదాలనే అనే సంకల్పంతో మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అలాగే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story