- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానలు రాక ఖరీఫ్ కంటతడి..!
రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఏటా క్రమం తప్పకుండా కురిసే వర్షాలు ఈ ఏడాది ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది.

రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఏటా క్రమం తప్పకుండా కురిసే వర్షాలు ఈ ఏడాది ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. వరి సాగుకు సిద్ధం చేసిన నారుమడులు ముదిరిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఎన్నడు లేని విధంగా ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం వర్షాభావ పరిస్థితులే. ఖరీఫ్‌లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వర్షాలపైనే ఆధారపడి సాగవుతాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇంతవరకు సాగుకు ఉపయోగపడే వర్షాలు పడలేదు. దీని ప్రభావం పంటలపై తీవ్రంగా పడింది. హుజూరాబాద్ డివిజన్‌లో జూలై రెండో వారం నాటికే 50శాతం నాట్లు పూర్తి అయ్యేవి. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు 20శాతం మేరా బావులు, బోర్ల కింద మాత్రమే నాట్లు వేశారు. నీటి నిల్వలు ఉన్నచోట వ్యవసాయ పనుల సందడి కనిపిస్తుంది. మెట్ట ప్రాంతాల భూములు బీడుగానే మిగిలిపోయాయి. వర్షాల వల్ల నారు మడులు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. జూలై నెల ముగుస్తున్నప్పటికీ సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదని రైతులు వాపోతున్నారు. - దిశ, హుజూరాబాద్ రూరల్
దిశ, హుజూరాబాద్ రూరల్ : రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఏటా క్రమం తప్పకుండా కురిసే వర్షాలు ఈ ఏడాది ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. వరి సాగుకు సిద్ధం చేసిన నారుమడులు ముదిరిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఎన్నడు లేని విధంగా ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం వర్షాభావ పరిస్థితులే. ఖరీఫ్‌లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వర్షాలపైనే ఆధారపడి సాగవుతాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇంతవరకు సాగుకు ఉపయోగపడే వర్షాలు పడలేదు. దీని ప్రభావం పంటలపై తీవ్రంగా పడింది.
హుజూరాబాద్ డివిజన్‌లో జూలై రెండో వారం నాటికే 50శాతం నాట్లు పూర్తి అయ్యేవి. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు 20శాతం మేరా బావులు, బోర్ల కింద మాత్రమే నాట్లు వేశారు. నీటి నిల్వలు ఉన్నచోట వ్యవసాయ పనుల సందడి కనిపిస్తుంది. మెట్ట ప్రాంతాల భూములు బీడుగానే మిగిలిపోయాయి. వర్షాల వల్ల నారు మడులు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. జూలై నెల ముగుస్తున్నప్పటికీ సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదని రైతులు వాపోతున్నారు.
ఈ రెండు నెలలు కీలకం.. ఏఇఓ సతీష్ రెడ్డి, హుజూరాబాద్
ఖరీఫ్ సాగుకు ఈ నెలతోపాటు ఆగస్టు నెల కీలకం. ఈ సమయంలో వర్షాలు పడితే వరి నాట్లు పడే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళిక పరంగా చర్యలు తీసుకుంటున్నాం.
నారు ముదిరిపోతుంది.. - కుడిక్యాల ఉపేందర్, రైతు
ఎప్పుడు లేని విధంగా వర్షాలు మాపైనే పగబట్టాయి. వరి నాట్లు వేసేందుకు నాలుమడిని సిద్ధం చేశాను. పోసిన నారు ముదిరిపోతుంది. ఇప్పటికైనా వానలు పడకపోతే వరి సాగు వేయడం కష్టమవుతుంది.
ఈ పదేళ్లలో ఇదే తొలిసారి..- పసికే రాజిరెడ్డి, రైతు
ఈ ఖరీఫ్‌లో వరి నాట్లు ఆలస్యం అవ్వడం ఈ పదేళ్లలో ఇదే తొలిసారి. ఎప్పుడైనా జూలై మొదటి వారంలో నాట్ల పనులు పూర్తయ్యేవి. దున్నేందుకు ఈ ఏడాది తగినన్నీ నీళ్లు లేవు. వ్యవసాయం ఇబ్బందిగా మారింది.






