- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ప్రారంభమైన విచారణ
గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అడ్వకేట్లను బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‍లపై (Disqualification Petitions) విచారణ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‍లో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) హాజరయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లను పిటిషనర్స్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యదయ్య, ప్రకాశ్ గౌడ్ లను విచారించాలని నిర్ణయించారు. కానీ కాలే యదయ్యకు విచారణకు ఎక్కువ సయమం పట్టడంతో ఆ రోజున అందరి విచారణ సాధ్యం కాలేదు. దాంతో ఇవాళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇవాళ వీరి విచారణ పూర్తయితే మరో నలుగురు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.






