- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. కొనసాగుతోన్న స్పీకర్ విచారణ
బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ (Congress)లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించి విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ (Congress)లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించి విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఇవాళ సరిగ్గా 11 గంటలకు విచారణను ప్రారంభించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్-10 ప్రకారం జరగనున్న విచారణకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (MLA Prakash Goud) తన అడ్వొకేట్లతో విచారణకు హాజరయ్యారు. సుమారు గంట పాటు కొనసాగిన విచారణ కాసేపటి క్రితం ముగిసింది. తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (Kale Yadaiah) స్పీకర్ ఎదుట హాజరుకానున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి వచ్చే అక్టోబర్ 6 వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు (V. Narasimhacharya) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.






