- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్‌జీ.. ప్లీజ్ స్టాప్ కట్టింగ్ అవర్ ఫారెస్ట్! Save HCU అంటూ ఢిల్లీలో జింక ప్లెక్సీలు
తెలంగాణలో సామాజిక అడవులను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని దేశ రాజధాని ఢిల్లీలో జింక ఫోటోతో ఉన్న పోస్టర్లు, హోర్డింగులు వెలిశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సామాజిక అడవులను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని దేశ రాజధాని ఢిల్లీలో జింక ఫోటోతో ఉన్న పోస్టర్లు, హోర్డింగులు వెలిశాయి. జింక ఉన్న పోస్టర్లను సామాజిక వేత్త రాజిందర్ బగ్గా అతికించినట్లు పేరు ఉంది. (Rahul Gandhi) రాహుల్ గాంధీ జీ.. ప్లీజ్ స్టాప్ కట్టింగ్ డౌన్ అవర్ జంగిల్స్ ఇన్ తెలంగాణ అంటూ ప్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హెచ్‌సీయూ భూములపై స్పష్టత ఇవ్వాలని రాహుల్ గాంధీని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో చెట్లనరికివేత, వేలం అంశంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు చెట్లు కొట్టివేయడంతో నీడను కోల్పోయిన జింకలు హెచ్‌సీయూ రోడ్లపైకి, జనవాసల్లోకి వచ్చి తిరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వర్సిటీ వెనుక వైపు ఉన్న ఎన్టీనగర్వైపు ఓ జింక కనిపించింది. ఓ ప్లైవుడ్ షాప్‌లోకి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ వస్తువులను చిందరవందర చేయడంతో ఫారెస్ట్, జూ పార్క్ సిబ్బంది వచ్చి వలవేసి పట్టుకుని జూపార్క్ కి తరలించారు. మరోవైపు శుక్రవారం ఓ జింక హెచ్‌సీయూలోనే కుక్క దాడికి తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఇక, హెచ్‌సీయూ 400 ఎకరాల వివాదాస్పద భూముల్లో చెట్లు కొట్టివేతపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం విధితమే. కోర్టు నుంచి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లను నరికి వేయోద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తక్షణమే పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.






