Deer meat: టోలిచౌకిలో జింక మాంసం రవాణా.. ఇద్దరు నిందితులు అరెస్ట్!

by Ramesh Naini |

నగరంలోని టోలిచౌకిలో జింక మాంసం రవాణా బయట పడింది.

Deer meat: టోలిచౌకిలో జింక మాంసం రవాణా.. ఇద్దరు నిందితులు అరెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అటవీశాఖ అధికారులు, టాస్క్​ఫోర్స్​ పోలీసుల ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జింక మాంసం రవాణాకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నగరంలోని (Toli Chowki) టోలిచౌకిలో జింక మాంసం (Deer meat) రవాణా బయట పడింది. టోలిచౌకి పరిధిలోని మానివ్‌ క్లాసిక్‌ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. తనిఖీల్లో భాగంగా పది కిలోల జింక మాంసం, మూడు జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు నిందితులు సలీం, ఇక్బాల్‌‌ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి.. కారును సీజ్‌ చేసినట్లు తెలిసింది. మరోవైపు నిందితుల నుంచి 5 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story