నేను తెలంగాణకు వచ్చేవరకు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు మున్షీ ఆదేశం

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల రహస్యం సమావేశం దూమారం రేపుతున్నది. ఈ మీటింగ్​విషయంలో ఎవరు మాట్లాడొద్దని పీసీసీ ఆదేశాలు జారీ చేసినా కొంత మంది ఎమ్మెల్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంపై హైకమాండ్​ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్​వినిపిస్తోంది.

నేను తెలంగాణకు వచ్చేవరకు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు మున్షీ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల రహస్యం సమావేశం దూమారం రేపుతున్నది. ఈ మీటింగ్​విషయంలో ఎవరు మాట్లాడొద్దని పీసీసీ ఆదేశాలు జారీ చేసినా కొంత మంది ఎమ్మెల్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంపై హైకమాండ్​ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్​వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్​మున్షీ పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్​చేసిన ఆరా తీసినట్లు తెలిసింది. ఈనెల 5వ తేదీన తెలంగాణ వస్తున్నానని, అప్పటివరకు ఎవరి ఎక్కడ మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధ ప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అంశం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ వద్దకు చేరడంతో సీరియస్​అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల భేటీలో కీలకంగా వ్యవహరించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడటంతో ఈ విషయంలో మరింత రచ్చకెక్కవచ్చనే భావనతో ఇంతటితో ముగింపు చేసేందుకు హస్తిన పెద్దలు రంగంలోకి దిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

Next Story