- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం మహా జాతరలో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి
మేడారం మహా జాతరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య(68) జాతరకు మొక్కులు చెల్లించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మేడారం మహా జాతరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య(68) గురువారం జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు జంపన్న వాగులో స్నానం చేస్తూ మరొక వ్యక్తి గల్లంతు అయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సాయిలు అనే వ్యక్తి వాగులో స్నానం చేస్తూ గల్లంతై మరణించినట్లు సమాచారం. అయితే, ఒకే రోజు ఇద్దరు జాతరలో మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు భక్తులను హెచ్చరించారు. వాగులో స్నానం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






