- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: జూబ్లీహిల్స్‌లో తీవ్ర విషాదం.. నీటిగుంటలో పడి బాలుడు మృతి
by GSrikanth |
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.45లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలోని ఇంటి నిర్మాణం కోసం తీసిన నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందారు.

X
దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45 లోని ఓ ఇంటి ఆవరణంలో నిర్మాణం కోసం గుంతలు తీసి వుండగా, సోమవారం రాత్రి కురిసిన వర్షానికి గుంతలు మునిగి ఉండటంతో.. ఇంటి ఆవరణంలోనే ఉన్న నాలుగేళ్ల వివేక్ అనే బాలుడు మంగళవారం ఉదయం ఆడుకుంటూ నీటి గుంతలో పడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చేలోపే బాలుడు మృతి చెందినట్లు బాధితులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం నగరంలో కలకలం రేపుతోంది.
Next Story






