తగ్గిన మహిళా పోలీస్ సిబ్బంది.. 33 శాతం రిజర్వేషన్ సాధ్యమేనా?

by Naga Rani Yarlagadda |

తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో మహిళా సిబ్బంది..

తగ్గిన మహిళా పోలీస్ సిబ్బంది.. 33 శాతం రిజర్వేషన్ సాధ్యమేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో మహిళా సిబ్బంది నాలుగు శాతం తక్కువగా ఉన్నారు. జాతీయ స్థాయిలో పోలీస్ విభాగంలో పని చేస్తున్న మహిళలు12 శాతం ఉండగా తెలంగాణలో 8 శాతమే ఉన్నారు. రాష్ట్రంలో డీజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ 7500 మంది మహిళలు పని చేస్తున్నారు.

33 శాతం కల్పించాలని సూచనలు

మహిళలకు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మహిళా సిబ్బంది ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఉమెన్ ఇన్ పోలీస్ కాన్ఫరెన్స్ ఈ అంశంపై చర్చించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, బ్యూరో ఆఫ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అండ్ డెవలప్‌మెంట్ నిబంధన ప్రకారం 33 శాతం కల్పించాలని నిబంధన ఉందని, దానిని తెలంగాణలో అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు.

5 విభాగాలుగా మహిళా పోలీసుల సమస్యలపై దృష్టి

ఆర్‌బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో మూడు రోజుల పాటు ఉమెన్ ఇన్ పోలీస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మహిళా సిబ్బంది సమస్యలపై ఐదు విభాగాలుగా చర్చించారు. విధుల్లో నిర్ణీత సమయం లేకపోవడంతో వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు సవాల్‌గా మారుతున్నాయని అనేక మంది అభిప్రాయ పడ్డారు. చాలా స్టేషన్లలో మహిళా సిబ్బందికి తగిన విశ్రాంతి గదులు, దుస్తులు మార్చుకునే గదులు లేవని గుర్తించారు. లింగ పక్షపాతంతో పాటు పలు కార్యాలయాల్లో వేధింపులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. షీ టీమ్స్, భరోసా సెంటర్లు వంటి ప్రత్యేక యూనిట్లలో సిబ్బంది కొరతతో పనిభారం పడుతుందని ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. మగవారితో సమానంగా ప్రమోషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న థీమ్స్

లింగ వివక్ష, శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి

చైర్‌పర్సన్‌గా డీజీ సైబర్ సెక్యూరిటీ శిఖా గోయెల్, సభ్యులుగా డీసీపీ ఎస్బీ కె.అపూర్వరావు

పని ప్రదేశంలో వేధింపులు

చైర్‌పర్సన్‌గా ఏడీజీపీ ఉమెన్ సెఫ్టీ వింగ్ చారు సిన్హా, సభ్యులుగా డీఐడీ ఉమెన్ సెఫ్టీ వింగ్ రెమా రాజేశ్వరి, అసిస్టెంట్ కమాండెంట్, సీఆర్పీఎఫ్ మోనికా సాల్వే

సంస్థాగత సంస్కృతి మార్పు

చైర్‌ పర్సన్‌గా డైరెక్టర్ టీజీపీఏ అభిలాషా బిష్త్, సభ్యులుగా మధ్యప్రదేశ్ డీఐడీ వినీత్ కపూర్

పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు, బందోబస్తు, అమలు సమస్య, వ్యక్తిగత భద్రత, హింసకు గురికావడం

చైర్‌పర్సన్‌గా ఏడీజీపీ (ఆర్గనైజేషన్, హోంగార్డు) స్వాతి లక్రా, సభ్యులుగా డీసీపీలు పీ.వీ పద్మజ, కె.శిల్పవల్లి, డీడీ ఆర్‌బీవిఆర్ఆర్ జీ.కవిత

పని, జీవిత సమతూల్యత, ఆరోగ్యం, సంక్షేమం

చైర్‌ పర్సన్‌గా ఏడీజీపీ ఈవోడబ్ల్యూ బీ.బాలనాగదేవి, డీసీపీ ఎన్.శ్వేత, డీసీపీ రక్షిత, మూర్తి, డీఎస్పీ టీజీపీఏఏ ఎన్.సందీప్‌రెడ్డి.

Next Story