- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రజలకు మద్యంపై తగ్గుతున్న ఇంట్రెస్ట్.. ఆశ్చర్యానికి గురిచేస్తున్న గత 2 ఏళ్ల ఆదాయ వివరాలు!
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 2024-25 వార్షిక సంవత్సరంలో రూ. 34,600 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదికలో తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 2024-25 వార్షిక సంవత్సరంలో రూ. 34,600 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదికలో తెలిపింది. 2024-25 వార్షిక సంవత్సరంలో బీర్లు, లిక్కర్ అమ్మకాలు వివరాలు వెల్లడించింది. బీర్ల అమ్మకాల్లో 3శాతం తగ్గినట్లుగా, లిక్కర్ అమ్మకాల్లో మాత్రం 2శాతం పెరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. గత సంవత్సరంలో రూ.34800 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గతేడాది రూ.264 కోట్లు వైన్ షాపులకు వచ్చిన అప్లికేషన్లకు నాన్ రీఫండబుల్‌గా వచ్చినట్లు పేర్కోన్నారు. అందువల్ల ఈ వార్షిక ఏడాదిలో ఆదాయం తగ్గినట్లుగా కనిపిస్తుందని, కానీ ఈ సంవత్సరంలో కేవలం అమ్మకాల ద్వారా మాత్రమే 7శాతం ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు.
బీర్లకు సంబంధించి 3శాతం అమ్మకాలు గతేడాదితో పోలీస్తే తగ్గినట్లు వెల్లడించారు. 2023-24 వార్షిక సంవత్సరంలో 548లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరుగగా 2024-25 వార్షిక ఏడాదిలో 531 లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. జనవరి నెలలో యూబీ కంపెనీకి చెందిన కింగ్ ఫిషర్ తయారి నిలిపివేయడం, బీర్ల ధరలలో స్పలంగా పెరగటంతో బీర్ల అమ్మకాలు తగ్గినట్లుగా టీజీబీసీఎల్ అధికారులు తెలిపారు. లిక్కర్ కు సంబంధించి మాత్రం 2శాతం పెరుగుదల ఉందని వెల్లడించారు. 2023-24 వార్షిక సంవత్సరంలో 362లక్షల కాటన్ల లిక్కర్ అమ్మకాలు జరుగగా 2024-25 సంవత్సరంలో 369 లక్షల కాటన్ల అమ్మకాలు జరిగాయి. టాక్స్ రూపంలో రూ.7వేల కోట్లు సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
హరిత హోటల్ లలో బార్ల ఏర్పాటు
ఆదాయ మార్గాల పెంపును యోచిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. నిరూపయోగంగా ఉన్న హరిత హోటల్ లో బార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో సోమవారం మరోసారి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎక్సైజ్ అధికారులు భేటీ అయినట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల ప్రాంతాలలో ఉన్న హరిత హోటల్స్ మినహా రాష్ట్రం అంతటా ఈ ప్రక్రియ చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాగైనా నిరూపయోగంగా ఉండి నష్టాలలో ఉన్న హరిత హోటల్స్ ద్వారా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. గతంలో అనివార్య కారణాలతో మూతపడిన 40 వైన్స్ షాప్ లకు టెండర్లు వేసేందుకు చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. నూతన మద్యం కంపెనీలను ఆహ్వానిస్తూ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగియడంతో ఎంపిక ప్రక్రియపై టీజీబీసీఎల్ కసరత్తు ప్రారంభించింది. 59 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
గత రెండు సంవత్సరాలు తగ్గుతున్న ఎక్సైజ్ ఆదాయం
ఎక్సైజ్ ఆదాయ వివరాలు పోలిస్తే గత రెండు సంవత్సరాలలో ఆదాయం పెరగనట్లుగానే తెలుస్తున్నది. 2021-22 వార్షి్క సంవత్సరంలో రూ.3500 కోట్లు పెరిగి రూ.30,783 కోట్ల ఆదాయం సమకూరింది. 2022-23 వార్షి్క ఏడాదిలో రూ.4362కోట్లు పెరిగి రూ.35,145 ఆదాయం సమకూరింది. గత రెండు సంవత్సరాల కాలంలో ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. 2023-24 వార్షి్క సంవత్సరంలో రూ.345 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లుగా కనిపిస్తుంది. 2024-25 వార్షి్క సంవత్సరంలో రూ.200 కోట్ల ఆదాయం తగ్గినట్లుగా తెలుస్తుంది. 2023-24 సమయంలో ఎన్నికల కారణంగా ఆదాయం పెరిగినట్లుగా చెబుతున్నారు.






