GBS Virus : పెరుగుతున్న జీబీఎస్ వైరస్ రోగుల మరణాలు

by Y. Venkata Narasimha Reddy |

జీబీఎస్(Guillain Barre Syndrome) వైరస్ విస్తరణ క్రమంగా పెరిగిపోతుండగా..వ్యాధి బారిన పడిన రోగుల మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కరంగా మారింది. మహారాష్ట్ర (Maharashtra)లో జీబీఎస్ (GBS) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

GBS Virus : పెరుగుతున్న జీబీఎస్ వైరస్ రోగుల మరణాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జీబీఎస్(Guillain Barre Syndrome) వైరస్ విస్తరణ క్రమంగా పెరిగిపోతుండగా..వ్యాధి బారిన పడిన రోగుల మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కరంగా మారింది. మహారాష్ట్ర (Maharashtra)లో జీబీఎస్ (GBS) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 192 గులియన్ బారే సిండ్రోమ్ అనుమానిత కేసులు నమోదు కాగా అందులో 167 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక ఈ వైరస్ కారణంగా ఏడు మరణాలు కూడా నమోదయ్యాయి. అందులో ఒకరు జీబీఎస్ వ్యాధి కారణంగానే మరణించినట్లు నిర్ధారణ చేయగా.. మిగతా 6 మంది రోగులు కూడా ఆ వైరస్ తీవ్రతతోనే చనిపోయారన్న అనుమానాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇప్పటిదాక నమోదైన 167 కేసుల్లో.. పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39, ఇతర గ్రామాల నుంచి 91, సింపి చించాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 29, పూణే రూరల్ ఏరియాలో 25, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 48 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని..అందులో 21 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక చికిత్స అనంతరం సుమారు 91 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లుగా కూడా వెల్లడించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలను చేపట్టింది. ప్రైవేటు నీటీ ఫ్లాంట్ల సీజ్ సహా పలు చర్యలను తీసుకుంటుంది.

తెలంగాణలో కూడా తాజాగా తొలి జీబీఎస్‌ మరణం నమోదు అయిందైన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ..ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఆమెకు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్‌లోని నిమ్స్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఇలా ఆమె వైద్యానికి లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుందని.. తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జీబీఎస్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళకు గురికావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. బాధితుల్లో కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయని.. చికిత్సతో బాధితులకు నయం చేయొచ్చని అంటున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితిలో జీబీఎస్ బారిన పడుతామంటున్నారు. నరాలపైనే జీబీఎస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. కలుషిత ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్‌ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Next Story