Stop Hindi: డియర్ తెలంగాణ సీఎం.. మేము హిందీ కోరుకోవట్లేదు.. ఓ నెటిజన్ ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-03-18 13:08:33  IST  )

దక్షిణాదిలో హిందీ భాషా వివాదం క్రమంగా ముదురుతోంది.

Stop Hindi: డియర్ తెలంగాణ సీఎం.. మేము హిందీ కోరుకోవట్లేదు.. ఓ నెటిజన్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణాదిలో హిందీ భాషా వివాదం (Hindi language controversy) క్రమంగా ముదురుతోంది. తమపై (Hindi) హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో అత్యధిక మంది మాట్లాడే హిందీ భాషకి జాతీయ భాషగా పట్టం కట్టాలని ఆ భాషకు చెందిన వారు.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల వారు తరచుగా వాదిస్తున్నారు. కానీ.. దేశంలో హిందీ మాట్లాడే వారి కన్నా వేర్వేరు భాషలు మాట్లాడేవారే అధికంగా ఉన్నారు కనుక ఇది కుదరదని ఇతర భాషలకు చెందిన వారు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వారు అభ్యంతరం చెప్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సైతం హిందీని రుద్దడం ఆపీ.. తెలుగు భాషను కాపాడుకోవాలని పలువురు సాహితీ వేత్తలు అంటున్నారు. సోషల్ మీడియాలో తెలుగును ప్రొత్సహించే వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో హిందీ విధింపు ఆపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘స్టాప్ హిందీ ఇన్ ఏపీటీఎస్’ అనే ఖాతా యూజర్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ప్రియమైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మేము హిందీ కోరుకోవడం లేదు. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ & టెక్నాలజీ కోరుకుంటున్నాము.’ అని పేర్కొన్నారు.

Next Story