- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్‌లో ఆవుల చోరీపై స్పందించిన డీసీపీ
by Ajay Maddhiboyina |
సికింద్రాబాద్‌లో గోవులను ఖరీదైన కారులో ఎత్తుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జూలై 29న ఓ ఆవుకు మత్తు మందు ఇచ్చి కారులో ఎత్తుకుపోయిన దృశ్యాలు

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్‌లో గోవులను ఖరీదైన కారులో ఎత్తుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జూలై 29న ఓ ఆవుకు మత్తు మందు ఇచ్చి కారులో ఎత్తుకుపోయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోపై డీసీపీ రష్మి స్పందించారు.
సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో 30వ తారీఖు ఆవు మాయం అయ్యిందని ఫిర్యాదు అందిందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకుని కేసులు నమోదు చేశామని త్వరలోనే వాళ్లను మీడియా ముందు హాజరుపరుస్తామన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వారిని కూడా పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






