- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీపీ చైతన్య, గన్ మెన్ ధైర్య సాహసాలకు హ్యాట్సాప్: డీజీపీ
చాదర్ ఘాట్ కాల్పుల ఘటనలో గాయపడిన డీసీపీ చైతన్య, గన్ మెన్ మూర్తిని డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: చాదర్ ఘాట్ కాల్పుల ఘటనలో (Chaderghat firing incident) డీసీపీ చైతన్య, గన్ మెన్ మూర్తి ధైర్య సహాసాలను ప్రదర్శించారని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) అభినందించారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్య, గన్ మెన్ మూర్తిని ఇవాళ డీజీపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీజీపీ.. శనివారం చాదర్ ఘాట్ లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు కత్తితో దాడికి ప్రయత్నించారని చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య, గన్ మెన్ మూర్తి 750 మీటర్లు వెంబడించి చేజ్ చేశారని తెలిపారు. నిందితుడు సయ్యద్ ఒమర్ అన్సారీపై 22 కేసులు ఉన్నాయని కాలా పత్తర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీ షీట్ ఉందన్నారు. ఈ ఘటనలో గాయపడిన డీసీపీ చైతన్య, గన్ మెన్ మూర్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఇద్దరు అధికారులు రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. నిందితుడు అన్సారీకి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని ఇతని ఆరోగ్య పిరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు. పోలీసు అధికారులు పరారీలో ఉన్న వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.






