పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే.. ఇలాగే డెవలప్మెంట్ కనిపిస్తది.. DCM భట్టి కీలక ఆదేశం

by Gantepaka Srikanth |

గత సంవత్సరంతో పోలిస్తే కమర్షియల్ టాక్స్ శాఖ(Commercial Tax Department)లో మొత్తంగా 6 శాతం ప్రగతి కనిపించిందని.. ఇది మంచి పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.

పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే.. ఇలాగే డెవలప్మెంట్ కనిపిస్తది.. DCM భట్టి కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: గత సంవత్సరంతో పోలిస్తే కమర్షియల్ టాక్స్ శాఖ(Commercial Tax Department)లో మొత్తంగా 6 శాతం ప్రగతి కనిపించిందని.. ఇది మంచి పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మార్చి నెలలో CST ,VAT ఓవరాల్ గ్రోత్ రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. సుమారు రూ.500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరింది.. భవిష్యత్తులోనూ ఇలాగే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు.

అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఓపెన్ ఫ్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదని అన్నారు. విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ANPR) వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని, పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీలో సభ్యులుగా చేర్చాలని, గిరిజన సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పకడ్బందీగా అమలు చేసి అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది.

జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలని చెప్పారు. నిర్మాణం అనుమతుల విషయంలో HMDA వేగం పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story