- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్ పల్లిలో పట్టపగలే చోరీ
శంకరపట్నం మండలంలోని మెట్ పల్లి గ్రామంలో పట్ట పగలే దొంగలు రెచ్చి పోయారు.

మెట్ పల్లిలో పట్టపగలే చోరీ
- ఇంట్లోకి చొరబడిన నలుగురు గుర్తు తెలియని మహిళలు
- ల్యాప్ టాప్, ఇన్వర్టర్ బాక్స్ దొంగతనం
దిశ, శంకర పట్నం : శంకరపట్నం మండలంలోని మెట్ పల్లి గ్రామంలో పట్ట పగలే దొంగలు రెచ్చి పోయారు. కాగితాలు ఎరుకునే నలుగురు మహిళలు ఓ ఇంట్లో చోరీ చేసి రూ.25 వేల విలువ చేసే లాప్ టాప్ తో పాటుగా ఇన్వర్టర్ బాక్స్ ఎత్తుకెళ్లినట్లు బాధితుడు బియ్యాల కృష్ణ తెలిపాడు. అదే గ్రామంలోని ఓ బంధువు చనిపోతే అంత్యక్రియలో పాల్గొని వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉందని ఇంట్లోకి వెళ్లి చూడగా లాప్ టాప్, ఇన్వర్టర్ చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు ఈరెల్లి వెంకటేష్ ,ఏగుర్ల రాజమ్మ ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనానికి విశ్వప్రయత్నం చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్లూ కోట్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






