- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana: బంగారం కోసం తల్లిని దట్టమైన అడవిలో వదిలేసిన కూతురు.. రెండు రోజులుగా తిండి లేక..
బంగారం కోసం కన్న తల్లిని కూతురు దట్టమైన అడవిలో వదిలేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వృధాప్యంలో ఉన్న కన్నతల్లిని (Mother) కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ కూతురు తల్లి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లాగేసుకుని తల్లిని దట్టమైన అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. జగిత్యాల (Jagityal) జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరి గుండెలను పిండేస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ వీధిలో బుధవ్వ ఆమె కూతురు ఈశ్వరీ ఉంటున్నారు. నానా కష్టాలు పడి బుధవ్వ తన కూతురు ఈశ్వరిని పెంచి పెద్ద చేసింది. అయితే ఇటీవల ఈశ్వరికి తన తల్లి ఒంటిపై ఉన్న బంగారంపై కన్నుపడింది. వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఓ ప్లాన్ వేసింది. రెండు రోజుల క్రితం తన తల్లి బుధవ్వను గొల్లపల్లి మండలం (Gollapally Mandal) శ్రీరాముల పల్లే గ్రామ శివారులో ఉన్న దట్టమైన అడవీ వద్దకు తీసుకుని వెళ్లింది. అక్కడ తల్లి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాగేసుకుని అదే అడవిలో తల్లిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తాను ఎక్కడ ఉన్నానో తెలియక తిండి తిప్పలు లేక రెండు రోజులుగా బుధవ్వ ఆ అడవి (Forest) ప్రాంతంలో అటు ఇటు తిరుగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న యువకులు ఆమెను గమనించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో బుధవ్వను శ్రీరాముల పల్లెలోని సఖి సెంటర్ కు తరలించారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కన్నతల్లిని అడవిలో వదిలేసి వెళ్లిపోయిన ఆ కూతురికి తగిన బుద్ధిచెప్పాలని స్థానికులు కోరుతున్నారు.






