మామపై కోడలి ఘన విజయం.. ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయ సమరం

by Ramesh Naini |

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

మామపై కోడలి ఘన విజయం.. ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయ సమరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతుండగా, మరోవైపు కుటుంబ రాజకీయాల పోటీల్లో ఆసక్తికర ఫలితాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ గ్రామంలో ఆసక్తికర రాజకీయ సమరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన మామ సత్యనారాయణపై, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడలు రాధిక కేవలం 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మామ, కోడలి మధ్య సాగిన ఈ పోరు గ్రామ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉండగా, మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌, రెండో విడతలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ మద్దతు పొందిన సర్పంచి అభ్యర్థులు 600కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి మద్దతుతో 200కు పైగా, బీజేపీ 70కు పైగా, ఇతరులు 200కు పైగా స్థానాలు గెలుపొందారు.

Next Story