- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KRMB స్పెషల్ మీటింగ్‌కు డేట్ ఫిక్స్
by Gantepaka Srikanth |
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 20వ ప్రత్యేక సమావేశం ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 20వ ప్రత్యేక సమావేశం ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం కొనసాగనుందని కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాజ్‌పురే తెలిపారు. కేఆర్ఎంబీ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇన్‌సెంటివ్‌లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించి, తదుపరి కార్యాచరణను నిర్ణయించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై చర్చ ప్రధాన ఎజెండా రూపొందించారు. అయితే.. ఆన్‌లైన్‌లో సమావేశానికి హాజరయ్యే వారికి లింక్ పంపిస్తామని పేర్కొన్నారు. బోర్డు సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని కోరారు.
Next Story






