కోహెడ ఫ్రూట్ మార్కెట్‌‌కు ముహూర్తం ఫిక్స్.. జూన్ 3న శంకుస్థాపన చేయనున్న సీఎం

by Kema Shiva Kumar |

రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్మించనున్న మెగా ఫ్రూట్ మార్కెట్‌కు జూన్ 3న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

కోహెడ ఫ్రూట్ మార్కెట్‌‌కు ముహూర్తం ఫిక్స్.. జూన్ 3న శంకుస్థాపన చేయనున్న సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ప్రమాణాలతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోహెడలో నిర్మించదలచిన మెగా ఫ్రూట్ మార్కెట్ (Koheda Fruit Market) ప్రాజెక్టు‌కు అడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక మార్కెట్ నిర్మాణ పనులకు జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కలిసి కోహెడలోని మార్కెట్ కేటాయించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాగా కోహెడలో మొత్తంగా 239 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ సమీకృత మార్కెట్ సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించనుంది. కేవలం పండ్ల మార్కెట్ మాత్రమే కాకుండా, ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఫిష్ మార్కెట్ (Fish Market)ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంగణంలోనే ఒక కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని (Sub Registrar Office) కూడా నెలకొల్పనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Next Story