Dasoju: నాడు కాళ్లు మొక్కి నేడు విమర్శలా?.. మైనంపల్లికి దాసోజు కౌంటర్

by Prasad Jukanti |

మైనంపల్లి హన్మంతరావుకు కు దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు.

Dasoju: నాడు కాళ్లు మొక్కి నేడు విమర్శలా?.. మైనంపల్లికి దాసోజు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో రౌడీయిజానికి అడ్డు అదుపు లేదనడానికి మల్కాజిగిరి నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) అన్నారు. మరో నయీం మాదిరిగా మైనంపల్లి హన్మంతరావు (Mainampalli Hanumantha Rao) వ్యవహరిస్తూ ప్రజలను, బీఆర్ఎస్ కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తుంటే పోలీసులు తోలుబొమ్మల్లా చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వెధిస్తున్నారని ఇది ప్రజా పాలన అనాలా లేక రౌడీ పాలన అనాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మైనంపల్లిలో ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. కానీ మళ్లీ ఇవాళ గాంధీ భవన్ లో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. మైనంపల్లి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిలో పోలీసుల భాగస్వాములని కానీ ఇవాళ పోలీసుల చేతగాని తనం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్నారు.

చీమలు పెట్టిన పుట్టలకు పాములు జొరబడినట్లు మల్కాజిగిరిలోకి మైనంపల్లి హన్మంతరావు చొరబడి రౌడీయిజం చేస్తున్నారని దాంతో మల్కాజిగిరి ఒక్కటే కాదు హైదరాబాద్ ఇమేజ్ పాడవుతోందన్నారు. హన్మంతరావు చర్యలపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తామని అలాగే రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల సంఘాలతో పాటు అవసరం అయితే రాహుల్ గాంధీ వద్దకు సైతం వెళ్తామన్నారు. ‘నఫ్రత్‌ కీ బజార్‌ మే మహబ్బత్‌ కా దుకా ణ్‌' అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ఓక శాసనసభ్యుడు ఈర్ష్య, కక్ష,ద్వేషంతో రౌడీయిజం చేస్తుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినప్పుడు కేటీఆర్ కాళ్లు మొక్కిన మైనంపల్లికి ఇవాళ ఏమైందో ఏమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పార్టీ అతడికి అన్ని అవకాశాలు ఇచ్చినా కనీసం కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Next Story