- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోకిరీల బెడద.. ట్యాంక్ బండ్‌పై ప్రమాదకరమైన బైక్ స్టంట్స్
హైదరాబాద్ నగరంలో రాత్రి అయిందంటే పోకిరీల బెడద ఈ మధ్య ఎక్కువైతుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో రాత్రి అయిందంటే పోకిరీల బెడద ఈ మధ్య ఎక్కువైతుంది. ఇంతకాలం శివారుల్లో మాత్రం కనిపించే బైక్ స్టంట్స్.. నగరం నడిబొడ్డున కొందరు కుర్రాళ్ళు డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్యాంక్ బండ్‌పై ఆకతాయిల ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ వీడియో ప్రకారం.. ట్యాంక్ బండ్‌పై అర్ధరాత్రి పూట స్కూటీతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వాహనదారులను పోకిరీలు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలోనే ఓ వాహనదారుడు ఇందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నగరంలో బైక్ స్టంట్స్ కొత్త విషయం కాదు.. ప్రతీ రోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రాత్రి సమయాల్లో పోకిరీలు ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్నారు. వారిపై పోలీసులు గతంలో చాలా సందర్భాల్లో చర్యలు తీసుకున్నప్పటికీ పోకిరీలు మాత్రం మారడం లేదని నెటిజన్‌లు వాపోతున్నారు. వీడియో ఇదే..






