బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. భట్టి విక్రమార్క ఫైర్

by Satheesh |   (  Updated:2022-08-27 13:06:51  IST  )

రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.

బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. భట్టి విక్రమార్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎలాంటి అలజడులు లేకుండా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడుతోందని అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాగా, బీజేపీ బహిష్కృత నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనలను అణిచివేసి ఓల్డ్ సిటీలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు.

Also Read : వరంగల్‌ వేదికగా కేసీఆర్‌ అవినీతిపై గళమెత్తిన J P Nadda

Next Story