డేంజర్ బెల్స్.. ఈ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక

by Jakkula.Mamatha |

రాష్ట్రానికి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

డేంజర్ బెల్స్.. ఈ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రానికి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. పగలంతా ఎండలు దంచికొడుతుంటే, సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రం(Telangana)లోని 13 జిల్లాల్లో జూన్ వరకు తీవ్ర వడగాలుల ముప్పు ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో వడగాలులు తీవ్ర స్థాయిలో ఉంటాయని పేర్కొంది. వడగాలుల వల్ల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులు బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి.

ఈ నెలతో పాటు జూన్ లోనూ పరిస్థితి కఠినంగా ఉండనుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story