- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా రాజీనామాకు కారణం వాళ్లే : దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్లు ఎదుర్కొంటున్న సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని సెన్సేషనల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నేడు హిమాయత్‌నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. కావాలంటే తాను రాజీనామా చేసి, ఉపఎన్నికలకు వెళ్లి, భారీ మెజారిటీతో మళ్ళీ గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేసారు. తాను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచానని, ఉపఎన్నికలకు భయపడేది లేదు అన్నారు. అయితే తన ఈ నిర్ణయం వెనుక గల కారణాలను దానం మీడియాతో పంచుకున్నారు. రాజీనామా చేయడానికి, అవసరమైతే ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి తనకున్న ధైర్యం పార్టీ కార్యకర్తల నుంచే వచ్చిందని అన్నారు.
"రాజీనామా చేయడానికి నా ధైర్యం కార్యకర్తలే, ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కార్యకర్తలే" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామాకు సిద్ధమని దానం నాగేందర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.






