- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయా’.. MLA మాగంటి మృతిపట్ల దానం నాగేందర్ భావోద్వేగం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) సంతాపం తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) సంతాపం తెలిపారు. ఆదివారం ఉదయం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను. గోపీనాథ్ ఇక లేడు అనే వార్తను నా మనసు ఒప్పుకోవడం లేదని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, ఈనెల 5న (గురువారం) ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడించారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో, 2023లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగానూ మాగంటి గోపీనాథ్ పనిచేశారు. ఆయన మరణ వార్త తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు సంతాపం తెలుపుతున్నారు.






