నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు.. సభలో ఓపెన్ అయిపోయిన దానం

by Prasad Jukanti |   (  Updated:2026-03-29 07:02:57  IST  )

కేటీఆర్ చేసిన పనికి ఆరోజు మూసుకుని కోర్చున్నాం.. సభలో ఓపెన్ అయిపోయిన దానం

నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు..  సభలో ఓపెన్ అయిపోయిన దానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో మైనింగ్ మంటలు రేగాయి. అసెంబ్లీ వేదికగా మైనింగ్, ఇసుక అక్రమ రవాణాపై అధికార, విపక్షాల మధ్య రచ్చ పీక్స్ కు చేరింది. ఈ క్రమంలో ఆదివారం శాసనసభలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగగా కేటీఆర్‍పై ఎమ్యెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హాయంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని దానం ఆరోపించారు. అంతే కాదు మా సొంత భూమిని సైతం కేటీఆర్ (KTR) వదల్లేదని ఆయన చేసిన పనికి మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు నోరు మూసుకు కూర్చున్నామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా తండ్రి కష్టార్జితమైన మా సొంత భూమిని కేటీఆర్ ఓ ప్రైవేట్ కంపెనికీ అప్పగించారని హైదరాబాద్‍లో పుట్టి పెరిగిన మేము మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూయిస్తానన్నారు. మేమెంత నష్టపోయామో మాకు తెలుసు. మా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామన్నారు. ఈ భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

Next Story