- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తర్వాత మూసీ ప్రక్షాళన కోల్డ్ స్టోరేజ్‌కు పరిమితమైంది: దానం నాగేందర్
మూసీ ప్రక్షాళనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. యూరియా కొరతపై బీఆర్ఎస్ పట్టుబడింది. అయితే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. మూసీ ప్రక్షాళనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు. మూసీ ప్రక్షాళన కోసం దక్షిణ కొరియాలో బృందం అధ్యయం చేసిందని దానం నాగేందర్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004లోనే మూసీ ప్రక్షాళన ప్రణాళిక సిద్ధం చేశారని, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన కోల్డ్ స్టోరేజ్‌కు పరిమితమైందన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ ప్రక్షాళన చేపడుతోందని తెలిపారు. కలుషిత నీటితో పండించిన పంటల వల్ల రైతులు ధాన్యం అమ్మలేని పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి ఒక ప్రణాళిక బద్దంగా వెళ్తున్నారని, ప్రక్షాళనపై మంత్రుల బృందాన్ని సౌత్ కొరియాకు పంపించారని గుర్తుకు చేశారు.
మూసీ ప్రక్షాళన కోసం దక్షిణ కొరియాలో బృందం అధ్యయనం చేసిందన్నారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి టైమ్ లైన్ ఏమీ ఉందని ప్రశ్నించారు. సుమారు 5 వందల మిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారని తెలిపారు. మూసీ ప్రక్షాళన విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, ఏఐ ద్వారా మిస్ గైడ్ చేస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన టైమ్ లైన్ ప్రకటించి పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి.. ప్రక్షాళన త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






