‘రాజకీయ నేతలను లాగడం కరెక్ట్ కాదు’.. కవిత వ్యాఖ్యలకు దానం నాగేందర్ కౌంటర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-02 07:52:48  IST  )

కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report) మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) స్పందించారు.

‘రాజకీయ నేతలను లాగడం కరెక్ట్ కాదు’.. కవిత వ్యాఖ్యలకు దానం నాగేందర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report) మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌ రావు, సంతోష్‌ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనేది రాజకీయ ఆరోపణ మాత్రమే అని అన్నారు. కాళేశ్వరంపై లోతైన విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ల వ్యవహారంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులను చేయడం సరికాదని హితవు పలికారు. కొందరు అధికారుల దగ్గర వందల కోట్లు బయటపడుతున్నాయి. అలాంటి అధికారుల సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో తనకు స్పీకర్‌ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ చేత విచారణ చేయించాలని కోరింది. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది.

MLC KAVITHA: కవిత కొత్త పార్టీ పేరు ఫిక్స్.. ప్రకటన ఎప్పుడంటే?

Next Story