- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Danam Nagender: ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై దానం నాగేందర్ క్లారిటీ
ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే (Khairatabad) దానం నాగేందర్ (Danam Nagender) స్పందించారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని అన్నారు. నేనంటే గిట్టని వాళ్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. నేను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ, తన అనుచరులతో ఈ పాటికే దానం చర్చించారని, ఆదివారం సాయంత్రమే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన దానం జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.






