దామగుండం రాడార్ స్టేషన్ ప్రాజెక్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీజీ హైకోర్టు ఆదేశం

by Prasad Jukanti |

దామగుండం రాడార్ స్టేషన్ ప్రాజెక్టు విషయంలో పూర్తి వివరాలతో అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

దామగుండం రాడార్ స్టేషన్ ప్రాజెక్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీజీ హైకోర్టు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా దామగుండంలో ఈఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ (Damgundam Radar Station) విషయంలో పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. దామగుండం అటవీ ప్రాంతంలో ఈఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారించింది. ఈఎల్ఎఫ్ రాడార్ తో జీవవైవిధ్యం, ఔషధ మొక్కలు దెబ్బతింటాయని పిటిషనర్లు విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన కౌంటర్‍లో పూర్తి వివరాలు లేవని పిటిషనర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం అదనపు కౌంటర్ దాఖలుకు సమయమిస్తూ విచారణను వాయిదా వేసింది.

Next Story