దళిత సంఘాల ఆగ్రహం.. మంత్రి పొన్నంపై ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

by Kema Shiva Kumar |

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman)ను బహిరంగ వేదికపై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బాడీ షేమింగ్ చేయడం అధికార కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దళిత సంఘాల ఆగ్రహం.. మంత్రి పొన్నంపై ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman)ను బహిరంగ వేదికపై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బాడీ షేమింగ్ చేయడం అధికార కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి అడ్లూరి ఓ వీడియోను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో చివరగా తాము రేపటి వరకు పొన్నం నుంచి సమాధానం ఆశిస్తున్నామని.. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు అవుతాడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో మాదిగ సామాజికవర్గానికి చెందిన తమ నేతను అవమానిస్తారా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక కరీంనగరలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్‌ (Karimnagar)లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా బారీకేడ్లను కూడా ఏర్పాటు చేశారు.

Next Story