TG Dairy: త్వరలోనే ఆ బిల్లులు కూడా క్లియర్ చేస్తాం

by Gantepaka Srikanth |

రాష్ట్ర పాడి రైతులకు కేవలం రెండు నెలల బిల్లులు మాత్రమే పెండింగులో ఉన్నాయని, ప్రచారం జరుగుతున్నట్లు ఐదు బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయనడం అవాస్తమని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

TG Dairy: త్వరలోనే ఆ బిల్లులు కూడా క్లియర్ చేస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పాడి రైతులకు కేవలం రెండు నెలల బిల్లులు మాత్రమే పెండింగులో ఉన్నాయని, ప్రచారం జరుగుతున్నట్లు ఐదు బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయనడం అవాస్తమని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బిల్లులు బకాయి ఉన్నాయని తెలిపింది. జనవరికి సంబంధించి ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసిందని.. వాటిని నేటి నుంచి రైతుల అకౌంట్లలో జమచేస్తామని తెలిపింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.50.65 కోట్లను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని.. త్వరగానే క్లియర్ అవుతాయని పేర్కొంది.

Next Story