సైబర్ నేరాల నియంత్రణ కోసం.. జోన్ సైబర్ సెల్స్

by Bhanu |

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సరికొత్తగా జోన్ సైబర్ సెల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

సైబర్ నేరాల నియంత్రణ కోసం.. జోన్ సైబర్ సెల్స్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సరికొత్తగా జోన్ సైబర్ సెల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ జోనల్ సైబర్ సెల్స్ సైబర్ నేరాల నియంత్రణలో నగర పోలీసు కమిషనేట్ లోని 7 జోన్ లలో టాస్క్ ఫోర్స్ గా పని చేస్తాయన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ పాత పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో కొత్త జోన్ సైబర్ సెల్ ఆఫీసును గురువారం ప్రారంభించారు. ఈ జోన్ సైబర్ సెల్స్ పని విధానానికి సంబంధించి పోలీసు కమిషనర్ ఎస్ఓపి(స్టాండర్ట్ అపరేటింగ్ ప్రొసిడ్జర్)ని రూపొందించారు. ఈ ఎస్ఓపీ ద్వారా జోన్ సైబర్ సెల్ టీం కు సీపీ లక్ష్యాలను నిర్ధారించారు.

ఆ లక్ష్యాలు ఇలా..

*సైబర్ నేరాల ఫిర్యాదులను నమోదు చేయాలి. సమయానుసారంగా దర్యాప్తును చేయాలి.

*సాంకేతిక పరిజ్ణాణంతో నేరాల గుర్తింపు ప్రక్రీయను వేగవంతం చేసి పరిష్కార మార్గాలను మెరుగు పర్చుకోవాలి.

*సైబర్ నేరాల్లో నేరస్థులకు శిక్షలు ఖాయమయ్యేలా పని చేయాలి. బాధితులు నష్టపోయిన పరిహారాన్ని తిరిగి పొందే అవకాశాలను పెంచాలి.

*న్యాయస్థానాలు, బ్యాంకులతో సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలి.

*జోన్ స్థాయిలోనే ఫిర్యాదులను పరిష్కారం చేయాలి.

*పెండింగ్ కేసులను తగ్గించి, దర్యాప్తు సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.

*లక్ష కంటే ఎక్కువ నగదును పొగొట్టుకున్న కేసులను సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తారు.

* లక్ష కంటే తక్కువ పొగొట్టుకున్న కేసులను స్థానిక పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేసి , దర్యాప్తును జోన్ సైబర్ సెల్ పర్యవేక్షణ లో కొనసాగించాలి.

*జోన్ సైబర్ సెల్ అధికారులు దర్యాప్తును స్థానిక పోలీసు స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారితో కలిసి పని చేస్తారు. సాంకేతిక పరంగా అన్ని ఆధారాలను సేకరించి సంబంధిత దర్యాప్తు అధికారికి అప్పగిస్తారు. వీటితో దర్యాప్తు అధికారి చార్జీషీటు ను దాఖలు చేస్తారు.

*ప్రతి జోన్ సైబర్ సెల్ లో ఒక ఇన్స్ పెక్టర్ లేదా డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టెబుళ్లు. ఉంటారు.

*ప్రతి జోన్ సైబర్ సెల్ అధికారులు సిబ్బంది విద్యాసంస్థలు, కాలనీ రెసిడెనస్ అసోసియేషన్ లతో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.

*కొత్త మోసాలు, డిజిటల్ దర్యాప్తు టూల్స్, ఆధునిక దర్యాప్తు టెక్నిక్స్, ఐటీ చట్టం, బీఎన్ ఎస్ నిబంధనల పై అవగాహన పెంచుకుని సైబర్ నేరాల నియంత్రణకు ఈ జెడ్ సీసీ లు పని చేస్తాయని సీపీ స్పష్టం చేశారు.

Next Story