- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain Alert: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల అడ్వైజరీ
హైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Heavy Rain Alert)హైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్డుపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం నగరవ్యాప్తంగా.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలకు (Cyberabad Traffic Police) సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. (IT employees) ఐటీ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి లాగౌట్స్ ప్రారంభించాలని సూచించారు. విడతల వారీగా లాగౌట్స్ చేస్తే, నగరంలో ట్రాఫిక్‌ని నియంత్రించగలమని అధికారులు పేర్కొన్నారు. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని నగరవాసులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు, తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వాతావరణం, ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ట్వీట్ లింక్..






