- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: భారీ వర్షం పడే ఛాన్స్.. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి’
రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో జిల్లాలలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
హైదరాబాద్‌లో రాబోయే 48 గంటల్లో వాతావరణం మేఘావృతమై, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా, రాబోయే 24 గంటల్లో నగరంలో కొన్నిచోట్ల తీవ్రమైన వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుండి గంటకు 8-12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. నగరవాసులు వర్షం, ఈదురు గాలుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అయితే.. ఈ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే సౌకర్యాన్ని(Work From Home) కల్పించాలని కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు.






