సైబరాబాద్‌ పోలీసు వెబ్‌సైట్‌ పునరుద్ధరణ

by Gantepaka Srikanth |

సైబరాబాద్‌ పోలీసు వెబ్‌సైట్‌ పునరుద్ధరణ

సైబరాబాద్‌ పోలీసు వెబ్‌సైట్‌ పునరుద్ధరణ
X

దిశ, వెబ్‌డెస్క్: సైబరాబాద్‌ పోలీసుల(Cyberabad Police) అధికారిక వెబ్‌సైట్‌ ప్రజలకు అందుబాటులో ఉందని సైబరాబాద్‌ ఎస్బీ & ఇన్‌ఛార్జ్‌ సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ వై.వీ.ఎస్‌. సుధీంద్ర(DCP Sudheendra) తెలిపారు. నవంబర్‌ 15, 2025 నుంచి వెబ్ సైట్ మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్‌ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో లేదన్నారు. అత్యవసర సాంకేతిక నిర్వహణ, భద్రతను పెంచేందుకు చేపట్టిన పనుల కారణంగానే వెబ్ సైట్ డౌన్‌టైమ్‌ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి www.cyberabadpolice.gov.in పోలీస్ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ప్రజలు సమాచారం, వివిధ సేవలు కోసం సైబరాబాద్‌ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌ను ఇకపై యథావిధిగా వినియోగించుకోవచ్చని డీసీపీ సూచించారు.

Next Story