- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో విమానాల ఇష్యూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు
ఇండిగో విమానాల ఇష్యూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో విమానాల రద్దు వేళ ప్రయాణికులలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ బి.రాజేష్, అదనపు డీసీపీ కె.పూర్ణచందర్ రావు, ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్, ఆర్జీఐఏ ఔట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య శుక్రవరం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఇండిగో విమానాల రద్దు, విమాన కార్యకలాపాల్లో వచ్చిన అంతరాయాలపై అధికారులు ఇండిగో రీజినల్ మేనేజర్‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. సమస్యను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సాధారణ సేవలు పునరుద్ధరించనున్నామని రీజినల్ మేనేజర్ డీసీపీకి వివరించారు.
అనంతరం డీసీపీ సిబ్బందితో కలిసి ఇండిగో చెకిన్ కౌంటర్లు, డిపార్చర్ జోన్, బోర్డింగ్ గేట్లు, బస్ గేట్లను పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది నియామకాలను సమీక్షించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా, పీక్ అవర్స్‌లో, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీఐఏ అవుట్ పోస్ట్ ఇన్ స్పెక్టర్ సంపతి కనకయ్యను ఆదేశించారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీసీపీ తెలిపారు.






