పనివాళ్లను పెట్టుకునే ముందు జాగ్రత్త : సీపీ అవినాష్ మొహంతి

by Naga Rani Yarlagadda |

కూకట్ పల్లిలో కలకలం రేపిన మహిళ రేణు అగర్వాల్ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

పనివాళ్లను పెట్టుకునే ముందు జాగ్రత్త : సీపీ అవినాష్ మొహంతి
X

దిశ, వెబ్‌డెస్క్: కూకట్ పల్లిలో కలకలం రేపిన మహిళ రేణు అగర్వాల్ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి మాట్లాడుతూ.. మహిళను కేవలం డబ్బు, నగల కోసమే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. హత్యానంతరం నిందితులు సికింద్రాబాద్ నుంచి సొంతూరు రాంచీకి క్యాబ్ లో వెళ్లారని, క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు. జార్ఖండ్ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వారిని హైదరాబాద్ కు తరలిస్తామని వెల్లడించారు.

ఇక ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో సీపీ అవినాష్ మొహంతి నగర ప్రజలకు కీలక సూచన చేశారు. ఇంట్లో ఎవరినైనా పనికి పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లోనే వసతి కల్పించి పనిలో పెట్టుకునేవారి గురించి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం మంచిదని తెలిపారు. రేణు అగర్వాల్ ను చంపిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన రోషన్ పై రాంచీలో ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులు దోచుకెళ్లిన బంగారాన్ని రాంచీలో అమ్మేసి డబ్బులు తీసుకున్నారని, వారినుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేశామని తెలిపారు.

Next Story