- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధులే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి : శిఖా గోయల్
వృద్ధులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : వృద్ధులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించిన ‘సైబర్ జాగృక్త దివస్’ను పురస్కరించుకుని ఏప్రిల్ నెలను ప్రత్యేకంగా వృద్ధుల సైబర్ అవగాహన మాసంగా అంకితం చేసినట్లు ఆమె తెలిపారు. వృద్ధులు తమ జీవితకాల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లకు చిక్కి కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, అందుకే వారిని చైతన్య పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్రామ సభ’ కార్యక్రమాల్లో భాగంగా 281 అవగాహన సదస్సులు నిర్వహించినట్లు వివరించారు. వృద్ధులు ఆత్మవిశ్వాసంతో, భయం లేకుండా డిజిటల్ సేవలను వినియోగించుకోవాలనే లక్ష్యంతో అన్లైన్ బట్ అన్ ఫ్రైడ్ అనే నినాదంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు. నేరగాళ్లు వృద్ధులను దోచుకోవడానికి ప్రధానంగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారని, పోలీసులమని నమ్మించి వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె వెల్లడించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే, ‘గోల్డెన్ అవర్’లో అంటే మొదటి గంటలోనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.






