Cyberabad: ఈ ఏడాది సైబరాబాద్‍లో తగ్గిన నేరాలు: సీపీ అవినాష్ మహంతి

by Prasad Jukanti |   (  Updated:2025-12-23 10:26:04  IST  )

Cyberabad: ఈ ఏడాది సైబరాబాద్‍లో తగ్గిన నేరాలు:  సీపీ అవినాష్ మహంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాల నష్టాలు 50 శాతం తగ్గాయని, డిజిటల్ అరెస్ట్ కేసులు 90 శాతం తగ్గాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పారు. ఇవాళ ఆయన 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నార్కోటిక్స్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని డెకాయిట్, మర్డర్ కేసులు తగ్గాయని తెలిపారు. ట్రాఫిక్ పరంగా రోడ్డు యాక్సిడెంట్ కేసులు కూడా తగ్గాయని బ్లాక్ స్పాట్స్ కారణంగా రోడ్డు యాక్సిడెంట్ తగ్గాయిని వెల్లడిచారు. చలన్లు కూడా పెరిగినట్టు తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయడం వల్ల ట్రాఫిక్ పెరిగిందని 10 నుండి 12 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. 24 గంటల్లో 20 నుండి 24 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు.

ఎకనామిక్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఉమెన్ సేఫ్టీవింగ్ బాగా పనిచేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని వెనక్కి పంపుతున్నామని చెప్పారు. ఓవర్ స్టే చేస్తూ క్రిమినల్ పనులు చేస్తున్నారని అలాంటి వారిపై దృష్టి సారించామన్నారు. బ్లాస్టింగ్, దీవాలి క్రాకర్స్ ఆన్ లైన్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. మిస్ వరల్డ్ లాంటి కార్యక్రమాలను కూడా విజయవంతంగా పనిచేశామన్నారు. సైబరాబాద్ పోలీసు తరఫున వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా విరివిగా చేస్తున్నామని చెప్పారు.

Next Story