- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రూజ్ ట్రిప్ పేరుతో భారీ మోసం.. కాచిగూడ వాసికి రూ. 2.42 లక్షల టోకరా
ఆన్‌లైన్‌లో సరదాగా క్రూజ్ యాత్ర (Cruise Journey) బుక్ చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు.

దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్‌లో సరదాగా క్రూజ్ యాత్ర (Cruise Journey) బుక్ చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు. డిసెంబర్ 26న బాధితుడు కొచ్చి, లక్షద్వీప్, ముంబై వెళ్ళడానికి గూగుల్‌లో సెర్చ్ చేసి ఒక నకిలీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. అది నిజమైనదే అని నమ్మి నలుగురికి టికెట్లు బుక్ చేస్తూ మొదట రూ. 23,680 చెల్లించారు. ఆ తర్వాత నేరగాళ్లు లక్షద్వీప్ పర్మిట్ లెటర్లని, పిల్లల ఛార్జీలని నమ్మించి విడతల వారీగా డబ్బులు గుంజారు. పేమెంట్ ఫెయిల్ అయ్యిందని, టెక్నికల్ సమస్యలని సాకులు చెబుతూ.. రీఫండ్ కావాలంటే ముందుగా క్యాన్సిలేషన్ ఛార్జీలు కట్టాలని వాట్సాప్ ద్వారా వేధించారు. ఇలా మొత్తం రూ. 2,42,488 పోగొట్టుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్.. వాట్సాప్ ఛానెల్ ద్వారా ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. క్రూజ్ ప్యాకేజీలను కేవలం అధికారిక వెబ్‌సైట్లు, గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. టెక్నికల్ సమస్యల పేరుతో మళ్లీ మళ్లీ డబ్బులు అడిగినా, వాట్సాప్ ద్వారా కస్టమర్ కేర్ అని చెప్పి ఫోన్ చేసినా నమ్మవద్దని హెచ్చరించారు. నిజమైన కంపెనీలు రిఫండ్ ఇవ్వడానికి క్యాన్సిలేషన్ ఛార్జీలు ముందుగా అడగవని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా 87126 65171 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.






