హోం కార్యదర్శి విధులు, తన జాబ్‌ కంటెంట్‌పై సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

హోం కార్యదర్శి బాధ్యతలు, హోం శాఖ పరిధిలోని ముఖ్య విధులపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ కీలక వివరాలను వెల్లడించారు.

హోం కార్యదర్శి విధులు, తన జాబ్‌  కంటెంట్‌పై సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హోం కార్యదర్శి బాధ్యతలు, హోం శాఖ పరిధిలోని ముఖ్య విధులపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ కీలక వివరాలను వెల్లడించారు. గత 2-3 నెలలుగా హోం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, తనను సంప్రదించిన పలువురు అధికారుల అభ్యర్థన మేరకు ఈ వివరాలను సంక్షిప్తంగా ట్వీట్ ద్వారా పంచుకున్నట్లు తెలిపారు. హోం శాఖ పరిధిలో పోలీస్ శాఖ కీలకంగా ఉందని, దీనికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నేతృత్వం వహిస్తారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన సర్వీస్ అంశాలు, శిక్షలపై అప్పీలు, బడ్జెట్, పరిపాలనకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు హోం శాఖ ద్వారా ప్రాసెస్ అవుతాయని వివరించారు. అదేవిధంగా, స్పెషల్ సీఎస్ (హోం) నేరుగా పర్యవేక్షించే మరికొన్ని కీలక శాఖలు కూడా ఉన్నాయని తెలిపారు.

వీటిలో ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, సైనిక్ వెల్ఫేర్ శాఖలు ఉన్నాయని వెల్లడించారు. ఈ శాఖలకు సీనియర్ IPS అధికారులు నేతృత్వం వహిస్తారని, ఆయా విభాగాల నుంచి వచ్చే ఫైళ్లను ప్రభుత్వ ఆమోదం కోసం హోం శాఖకు పంపిస్తారని తెలిపారు. హోం శాఖలో ఫైళ్లను బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రాసెస్ చేసి, అవసరమైతే లా, ఫైనాన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD), చీఫ్ సెక్రటరీ వంటి విభాగాలకు అభిప్రాయాలు, అనుమతుల కోసం పంపుతామని వివరించారు. అనంతరం అవి హోం మంత్రి, డిప్యూటీ సీఎం లేదా ముఖ్యమంత్రి తుది ఆమోదానికి వెళ్తాయని తెలిపారు.

ఈ శాఖలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చట్టపరమైన, పరిపాలన, ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం తీసుకుంటుందని, అవసరమైన సందర్భాల్లో హోం శాఖకు సంబంధించిన కీలక ప్రభుత్వ ఉత్తర్వులు (GOలు) జారీ అవుతాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ శనివారం ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ట్వీట్ ఇదే..

Next Story